స్టార్ కమెడియన్ వడివేలు ఇంట విషాదం

-

ప్రముఖ కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విశాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని (89) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వడివేలు తల్లి సరోజిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బుధవారం రాత్రి ఆమె తుది శ్వాస విడిచారు.

గురువారం సాయంత్రం వడివేలు స్వగ్రామంలో ఆమె అంతక్రియలు జరగనున్నట్లు సమాచారం. ఆమె మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె బ్రతిపట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. పలువురు సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజినీ మృతికి నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version