మెగాస్టార్ యుఎస్ఏ కలెక్షన్స్ రెండు మిలియన్ల పోస్టర్ వైరల్.!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు .

మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయని గాట్టిగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కూడా వసూళ్ళు వర్షం కురిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 100 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి 150 కోట్ల దిశగా దూసుకుపోతుంది. మరో రెండు మూడు రోజుల్లో ఈ ఫీట్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల తర్వాత మంచి మార్కెట్ గా చెప్పుకొనే యుఎస్ఏ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ చిత్రం ఇప్పటికే యూ ఎస్ లో వన్ మిలియన్ మార్కును అధిగమించింది. బుదవారం నాటికి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు మిలియన్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్ బ్రేక్ వసూళ్ళు సాధిస్తోంది. ఇంకొన్ని రోజులు వసూళ్ళు ఇలాగే ఉంటాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version