స్టార్ హీరోకి కరోనా పాజిటివ్..?

-

ప్రస్తుతం ఎంతో మంది పై పంజా విసురుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్… సామాన్యులు సెలబ్రెటీలు అనే తారతమ్యం చూడటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది ప్రజలపై పంజా విసిరి ప్రాణాలు తీయడమే కాదు ఎంతో మంది ప్రజాప్రతినిధులు అధికారులు సెలబ్రిటీలను కూడా ఈ మహమ్మారి వైరస్ వదలలేదు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రెటీలు కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్న విషయం తెలిసిందే.

ఇటీవలే మరో స్టార్ హీరో కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారిపోయింది. మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవలే కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతుండగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. అయితే ప్రస్తుతం జనగణమణ అనే సినిమా లో నటిస్తున్న సుకుమారన్ షూటింగ్ చేస్తున్న సమయంలోనే తాను వైరస్ బారిన పడి ఉండవచ్చు అని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక హీరో కరోనా వైరస్ బారిన పడడంతో సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version