Big Boss OTT Non Stop: క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ..అదరగొట్టిన నటరాజ్ మాస్టర్

-

‘బిగ్ బాస్’ ఓటీటీ షో మంగళవారం నాటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగింది. కంటెస్టెంట్స్ అందరూ ‘బిగ్ బాస్’ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ‘కిల్లర్’ గురించి తెలుసుకుని గేమ్ బాగా ఆడేందుకు ట్రై చేశారు. ఇంటి సభ్యులలో ఉన్న కిల్లర్ ఎవరు? అని తెలుసుకునేందుకు సాయశక్తుల ప్రయత్నించారు.

‘బిగ్ బాస్’ సైతం ఊహించని ట్విస్టులు ఇచ్చి కంటెస్టెంట్స్ ను సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రతీ ఒక్కరిని పిలిచి మీరే కిల్లర్ అని చెప్పి కొద్ది సేపు భయపెట్టారు. అలా ఎవరు కిల్లర్? అనేది తెలీకుండా చేశారు. మొత్తంగా హౌజ్ లో కిల్లర్ ఏం చేస్తాడో? అనే భయాందోళన అయితే క్రియేట్ చేశాడు.

ఎట్టకేలకు నటరాజ్ మాస్టర్ కు కిల్లర్ మీరే అని చెప్పాడు. దాంతో నటరాజ్ మాస్టర్ బ్యాలెన్స్‌డ్ గా ఆట ఆడటం స్టార్ట్ చేశాడు. కంటెస్టెంట్స్ ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్ లో ‘బిగ్ బాస్’ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందకు సాగాడు. అలా కిల్లర్ గా నటరాజ్ మాస్టర్ కిరాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మంగళవారం స్టార్ ఆఫ్ ది ఎపిసోడ్ కచ్చితంగా నటరాజ్ మాస్టర్ కు ఇచ్చేయొచ్చు అనేలా చేశాడు.

కిల్లర్ గా నటరాజ్ మాస్టర్ ఫస్ట్ శివనే టార్గెట్ చేశాడు. కాఫీలో ఉప్పు వేసి అతన్ని కిల్ చేసేశాడు. నెక్స్ట్ ‘బిగ్ బాస్’ సూచన మేరకు ఎవరైనా ఇంటి సభ్యుని బెడ్ మీద నీళ్లు పోయాలని చెప్పగా, నటరాజ్ మాస్టర్ అరియానా బెడ్ పైన వాటర్ పోశాడు.

అలా అరియానాను కిల్ చేశాడు. అయితే, నటరాజ్ మాస్టరే ‘కిల్లర్’ అని గుర్తించని బిందు మాధవి-శివలు ఆయనతో కిల్లర్ ఎవరై ఉంటారు? అని చర్చిస్తూనే ఉన్నారు. మొత్తానికి నటరాజ్ మస్టర్..‘కిల్లర్’గా అదరగొట్టేసి..ఇంటి సభ్యుల్లో ఆందోళనతో పాటు నవ్వులు పూయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version