హైకోర్టులో 779 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం..

-

తెలంగాణ హైకోర్టులో వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.మంజూరైన పోస్టుల వివరాలు..కేటగిరి పోస్టుల జాబితా లో రిజిస్ట్రార్ ( ఇన్ఫ్రాస్ట్రక్చర్)1, జాయింట్ రిజిస్ట్రార్ -3, డిప్యూటీ రిజిస్ట్రార్ -5, అసిస్టెంట్ రిజిస్ట్రార్ -4, సెక్షన్ ఆఫీసర్స్/ స్కూటీని ఆఫీసర్స్ -96, కోర్టు ఆఫీసర్స్/ అకౌంట్ ఆఫీసర్ కోర్టు మాస్టర్స్/ పిఎస్ టు జడ్జెస్ -59 పోస్టులు ఉన్నాయి.పీఎస్ టు రిజిస్టర్ కేటగిరిలో డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్/ ట్రాన్స్లేటర్ -78, కంప్యూటర్ ఆపరేటర్ -12, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ -73, అసిస్టెంట్ లైబ్రేరియన్ – 1,యూ.డీ.స్టేనో -1, అసిస్టెంట్స్ -72,

రీడర్స్ & ఎగ్జామినర్స్ -22, టైపిస్ట్ -24, కాపీయిస్ట్- 24, డ్రైవర్ -55, బైండర్ -1, బుక్ -బేరర్ -1, కాఫియర్ మిషన్ ఆపరేటర్ -1, రికార్డు అసిస్టెంట్ -27, లిఫ్ట్ ఆపరేటర్ -5, ఆఫీస్ కో ఆర్డినేటర్ పోస్టులు- 181, ఉన్నాయి.టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టు అసిస్టెంట్ రిజిస్ట్రార్( ఇన్ఫ్రాస్ట్రక్చర్) టెక్నికల్ అడ్వైజర్ కేటగిరి లోనూ పోస్టులు భర్తీ కానున్నాయి.ఈ విభాగంలో సూపర్ంటెండెంట్ ఇంజనీర్ పోస్టులు -4 , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్)-2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఎలక్ట్రికల్)-1, సెక్రటేరియల్ అసిస్టెంట్ క్యాడర్ -1, పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version