కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం…. ఎన్డీయే పాలన పై ట్వీట్

-

కేంద్ర ప్రభుత్వం పనితీరు… బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రశ్నిస్తున్నారు మంత్రి కేటీఆర్. అవకాశం వచ్చినప్పుడల్లా ట్విట్టర్ లో బీజేపీని విమర్శిస్తున్నారు. నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, ధాన్యం కొనుగోలు అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ గురించి విమర్శించారు. కేంద్రం, బీజేపీ పార్టీలు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని.. కులమతాల మధ్య వైషమ్యాలు పెట్టి ఓట్ల రాజకీయం చేస్తుందని గతంలో కేటీఆర్ విమర్శించారు.

తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, పెరుగుతున్న రేట్ల గురించి విమర్శించారు. భారతదేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని… ద్రవ్యోల్భనం 30 ఏళ్ల గరిష్టానికి చేరుకుందని… ఇంధన ధరలు ఆల్ టై హైకి పెరిగాయని.. ఎల్పీజీ సిలిండర్ ధర ప్రపంచంలోనే అత్యధికమని విమర్శించారు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అనాలా లేకపోతే NPA ప్రభుత్వం అని పిలవాలా? అని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని విమర్శించారు కేటీఆర్. ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version