గుడ్ న్యూస్ : రూ.387 కోట్ల సీడీపీ నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎమ్యెల్సీల నియోజ‌క వ‌ర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సీడీపీ నిధుల‌ను విడుద‌ల చేసింది. 2021- 22 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను రూ. 387.50 కోట్ల సీడీపీ నిధులు రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను రాష్ట్ర ప్ర‌ణాళికా శాఖ ఉత్త‌ర్వులను జారీ చేసింది. కాగ రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజక వ‌ర్గాల అభివృద్ధి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తి ఏడాది రూ. 5 కోట్ల చొప్పున విడుద‌ల చేస్తుంది.

కాగ 2021 – 22 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి.. గ‌తంలోనే రెండు విడత‌ల్లో రాష్ట్ర ప్ర‌భుత్వం సీడీపీ నిధుల‌ను విడుద‌ల చేసింది. తాజా గా మ‌రిన్నీ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కొద్ది రోజుల్లో ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తున్న వేళ.. సీడీపీ నిధుల‌ను వృథా కాకుండా.. రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. కాగ ఈ నిధుల‌తో రాష్ట్రంలో నియోజ‌క వ‌ర్గాల్లో అభివృద్ధి కొంత వ‌ర‌కు మెరుగు ప‌డే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version