కొన్నిసార్లు క్రైమ్ న్యూస్ భలే వైరల్ అవుతాయి.. ఓసారి. ఓ పోలీసు అధికారి ఇంట్లో చోరి చేసి.. ఇంట్లో ఏం డబ్బు లేదని కోపం వచ్చిన దొంగలు ఆ అధికారిని తిట్టుకుంటూ లెటర్ రాసి పెట్టి వెళ్లారు.. అప్పట్లో ఆ వార్త కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు ఓ గుళ్లో విగ్రహాలు చోరి చేసి.. మళ్లీ కలలు వస్తున్నాయని..తిరిగి గుళ్లో అప్పగించేశారట.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.!
ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్.. బాలాజీ టెంపుల్ లో మే9 న చోరీ జరిగింది. తరౌన్హా ఏరియాలో .. ప్రధాన పూజారి నివసిస్తున్నారు.. రోజూలాగే ఆయన ఆదివారం తెల్లవారు జామునే నిద్రలేచి… కొన్ని పనులు చేసుకున్నాక… ఇంటి తలుపు తెరిచారు. చూస్తే… ఎదురుగా ఓ సంచి ఉంది. ఆశ్చర్యపోయాడు. “ఇదేంటి లోపల కొబ్బరి బోండాలున్నాయా?” అని తెరచి చూశాడు. విగ్రహాలు కనిపించాయి. వాటిని బయటకు తీశాడు. చోరీ అయిన 16 విగ్రహాల్లో 14 ఇంటి ముందే ప్రత్యక్షమవడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది.
దొంగలకు బుద్ది వచ్చి.. తెచ్చారనుకున్నాడు పూజారి.. సంచిలో విగ్రహాలను బయటకు తీస్తుండగా. ఓ లెటర్ కనిపించింది. అది దొంగలు సంచిలో వదిలిన పేజీ. అందులో… తమకు పీడకలలు వస్తున్నాయనీ… చోరీ చేసినప్పటి నుంచి తాము నిద్రపోలేకపోతున్నామనీ… అందుకే తిరిగి ఇచ్చేశామని రాశారు. అది చూసి పూజారితోపాటూ స్థానికులూ ఆశ్చర్యపోయారు.
16 అష్టధాతు విగ్రహాలు. వాటి విలువ కోట్లలో ఉంటుంది. మే 9 రాత్రివేళ ప్రాచీన బాలాజీ ఆలయంలో చోరీ జరిగింది. దీనిపై ప్రధాన పూజారి మహంత్ రామ్ బాలక్.. కేసు పెట్టారని సదార్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ వెల్లడించారు.
మొత్తానికి అలా జరిగింది.. మన దగ్గర కూడా.. చాలా దేవాలయాల్లో.. విగ్రహాలు చోరీ చేస్తుంటారు. కానీ తిరిగి ఇవ్వరనుకోండి. ఇక పోలీసులు పట్టుకుంటేనే వాటి జాడ దొరికేది..!