వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పై టిడిపి నాయకురాలు, సినీ నటి దివ్యవాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన టిడిపి మినీ మహానాడులో టిడిపి నేత దివ్యవాణి ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గుడివాడ అంటే దివంగత నేత ఎన్టీఆర్ గుర్తుకు వచ్చే వారని.. అలాంటి గుడివాడని క్యాసినో వాడగా కొడాలి నాని మార్చాడని విమర్శించారు.
కొడాలి నాని నోరు విప్పితే భూతులు తప్ప మరేమీ రావు అని అన్నారు. రాజకీయాల కోసం, పదవుల కోసం బూతులు మాట్లాడితే.. పంచలు ఊడదీసి కొడతాం అని హెచ్చరించారు దివ్యవాణి. జాన్ క్యాసినో నాని ముందు గుడివాడలో రోడ్డు వేసి చూపించాలి అని సవాల్ విసిరారు. గుడివాడ గడ్డ ను టిడిపి అడ్డాగా మారుస్తామని చెప్పారు టిడిపి నాయకురాలు, సినీనటి దివ్యవాణి.