డయాబెటిస్ ఉంటే ఈ పండ్లకి దూరంగా వుండండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ ( Diabetes ) ఉన్న వాళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వేళకు తినడం, మంచి నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండడం, ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం వంటివి పాటిస్తూ ఉండాలి. బాలన్స్ డైట్ తప్పకుండా తీసుకోవాలి. అదే విధంగా తమకు నచ్చిన ఆహారాన్ని తీసుకోకూడదు ఇష్టం వచ్చినట్లు ఆరోగ్యానికి హాని చేసే ఆహారం తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి అని గమనించాలి.

డయాబెటిస్ | Diabetes

పండ్లలో ఫైబర్, విటమిన్స్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా షుగర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకసారి డయాబెటిస్ పేషెంట్లు ఈ పండ్లు గురించి చూసి వీటికి దూరంగా ఉండడమే మంచిది అని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయని… వీటిలో షుగర్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరి ఆలస్యమెందుకు దానికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ చూస్తే మీకు ఏ పండ్లు తినాలి..?, ఏమి తినకూడదు అనేది తెలిసిపోతుంది. డయాబెటిస్ తో బాధపడే వాళ్లు మీడియం నుండి ఎక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ వరకు తీసుకోకుండా ఉండటం మంచిది.

మామిడి: మీడియం సైజ్ మామిడిలో 40 నుండి 45 గ్రాముల చక్కెర ఉంటుంది.

అరటి: మీడియం సైజు  అరటి పండులో దాదాపు 15 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.

 పుచ్చకాయ: పుచ్చకాయలో 7 గ్రాముల చక్కెర ఉంటుంది.

ద్రాక్ష: ఒక కప్పు ద్రాక్షలో 25 గ్రాముల చక్కెర ఉంటుంది.

ఎండు ఖర్జూరం: ఇందులో 4.5 గ్రాముల చక్కెర ఉంటుంది.

పైనాపిల్: ఒక కప్పు పైనాపిల్ ముక్కలలో 16.3 గ్రాముల చక్కెర ఉంటుంది.

అవోకాడోస్, జామూన్, కివి పండు, రేగు, మరియు జామ వంటి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయ పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version