వింతైన బిజినెస్ ఐడియా… భర్తలను కంట్రోల్ చేయడం ఎలా అని చిట్కాలతో సంపాదన..!

-

డబ్బులు సంపాదించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఎవరికి ఇష్టం అయిన ఫీల్డ్ ని వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలంటే మనం వ్యాపారాన్ని కానీ సర్వీసులు కానీ ఎంచుకుంటూ ఉంటాము. ఉదాహరణకి కారు సర్వీసింగ్ కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని కానీ లేదంటే చిన్న చిన్న బిజినెస్ ని కానీ చేస్తూ ఉంటాము. కానీ ఈ బిజినెస్ మాత్రం వేరే లెవెల్ లో ఉంది.

ఎవరు ఊహించలేని బిజినెస్ ఇది. మరి ఇంక ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. మామూలుగా ప్రతి భార్య కూడా భర్త తన మాట వినాలని అనుకుంటు ఉంటుంది. అయితే ఒక ఆమె మాత్రం భర్తలని ఎలా కంట్రోల్ చేయాలి అని బిజినెస్ ని మొదలు పెట్టింది. దీని మీద ఆమె ఆన్లైన్ క్లాస్లని కూడా ఇస్తుంది. పైగా టిప్స్ తీసుకున్న వారి దగ్గర నుండి ఫీజు కూడా వసూలు చేస్తుంది ఆమె. ఆమె పేరు మార్గరిట నజరేంకో.

ఆస్ట్రేలియాలోని సిడ్నికి చెందిన ఆమె. భర్తలని భార్యలు ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఈమె క్లాసులు తీసుకుంటూ ఉంటుంది. మహిళల ప్రవర్తనని జింక, ఆవు, గుర్రం కింద ఈమె పోల్చి చెప్తూ ఉంటుంది. మహిళలు ఎప్పుడు జింకల అప్రమత్తంగా ఉండాలని.. ఆవు అయితే ఉదయం నుండి సాయంత్రం వరకు పనులు చేస్తుందని… గుర్రం లాగ కొందరు మహిళలు ప్రవర్తిస్తూ ఉంటారని.. ఇలా ఆమె క్లాసులని చెప్తూ ఉంటుంది మహిళలు తన భర్త మాట వినాలి అంటే గొడవ పడడం ముందు మానేయాలని అని ఈమె అంటోంది. ఇలా ఆమె టిప్స్ ని ఇస్తూ డబ్బులను సంపాదిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version