కాలినడకన శబరిమల వెళ్తున్న కుక్క… ఇప్పటి వరకు 500 కిలోమీటర్లు నడిచింది

-

శబరిమలకు వెళ్లే భక్తులతో పాటు ఓ శునకం కూడా వెళ్లడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రతీ ఏటా దేశం నలుమూలల నుంచి శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు గాను వేల మంది భక్తులు కాలి నడకన పయనమవుతూ ఉంటారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అయ్యప్ప వద్దకు వెళ్లే వరకు వాళ్ళు నడక ఆపరు. మాల సమయంలో నిష్టగా ఉండే భక్తులు అక్కడికి వెళ్లి మొక్కు చెల్లిచుకుని వాస్తు ఉంటారు. ఈ క్రమంలోనే కొంత మంది భక్తులకు ఒక వింత అనుభవం ఎదురైంది. శబరిమల వెళ్లే భక్తులను ఒక కుక్క కూడా అనుసరించింది.

వివరాల్లోకి వెళితే ఈ నెల కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ముదాబుద్దీన్ నుంచి గురుస్వామి రాజేష్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల బృందం శబరిమలకు బయల్దేరి వెళ్లగా… వారు… అక్టోబర్ 31 న తిరుపతి నుంచి కాలినడకన తమ ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు వారు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించగా… వారితో పాటు ఒక వీధి కుక్క కూడా ఉంది. తిరుమలలో అయ్యప్పలు బయలుదేరినప్పుడు వారితో పాటు ఆ కుక్క వస్తుందని వారు గ్రహించలేదు… ఆ తర్వాత ఇద్దరు అయ్యప్పలు ఆ కుక్క తమను అనుసరించడం,

గమనించి దానికి ఆహారం పెట్టడం మొదలుపెట్టారు. ఈ ప్రయాణంలో కుక్క పలు మార్లు గాయాల పాలు అయింది… దీనిపై స్పందించిన భక్తులు తమకు ఈ విషయం ముందు తెలియలేదని… శబరి తమతో పాటు ఆ కుక్కను కూడా తీసుకువెళ్తామని ఏదైనా ఇబ్బంది వస్తే వైద్యం చేయిస్తామని వారు పేర్కొన్నారు. ప్రతీ ఏటా తాము వెళ్తామని కానీ ఇలాంటి అనుభవం తమకు ఎప్పుడు ఎదురు కాలేదని వారు మీడియాతో చెప్పారు. ప్రస్తుతం ఈ వార్త జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ని ప్రస్తుతం ట్విట్టర్ లో షేర్ చేస్తున్నారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version