దేశ రాజధాని ఢిల్లీలో, ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం బలమైన ప్రకంపనల ధాటికి ప్రజలు వణికిపోయారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం శుక్రవారం సాయంత్రం ఆఫ్ఘనిస్తాన్‌లో నమోదైందని ఐఎండి తెలిపింది. సాయంత్రం 5.09 గంటలకు సంభవించిన భూకంపం యొక్క ప్రకంపనలు. కాబూల్‌కు ఈశాన్యంగా 246 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న హిందూ కుష్ పర్వతాలలో దీని కేంద్రం గుర్తించారు.
భారత వాతావరణ శాఖ ప్రకారం, భూకంపం యొక్క లోతు 190 కి.మీ, తీవ్రత 7.1 గా అంచనా వేసింది. దీనికి సంబంధించిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియలేదు. ఢిల్లీ తో పాటుగా ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటీవల కూడా భూ ప్రకంపనలు ఉత్తర భారతదేశాన్ని భయపెట్టాయి. ఢిల్లీలో కొన్ని భవనాలకు బీటలు వారాయని సమాచారం. తీవ్రత ఎక్కువగానే ఉన్నా ఆస్తి నష్టం పెద్దగా జరగలేదని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.