ఏపీలోని అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మం. లింగరాజుపాలెంలోని కస్తుర్బా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో బాత్రూమ్స్ లేకపోవడంతో బెడ్షీట్లు అడ్డం పెట్టుకుని, లైట్లు ఆఫ్ చేసుకుని వరండాలోనే స్నానాలు చేస్తున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపితే.. చదువు ఏమీ బాగాలేదని బాధపడుతున్నారు. దారుణమైన పరిస్థితిలో కస్తూర్బా బాలికల వసతి గృహం ఉందని, తాము పాస్ అవుతామని నమ్మకం కూడా లేదని విద్యార్థినులు అన్నారు.
టీచర్స్ తమకు ఏమి చెప్పడం లేదని, తల్లిదండ్రులను కల నెరవేర్చలేని స్థితిలో ఉన్నామని విద్యార్థినులు తెలిపారు. లైట్లు ఆపి వరండాలో స్నానాలు చేసుకుంటున్నామని విద్యార్థినులు బోరున విలపిస్తున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం లింగరాజు పాలెంలో కస్తూర్బా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి పర్యంతమయ్యారు. ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గంలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి గాధ ఇదీ.. జిల్లా అధికారులు స్పందించి కస్తూర్బా వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థినులు వేడుకుంటున్నారు.