బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. బంగాల్ అసెంబ్లీలోకి ‘ఫేక్ ఎమ్మెల్యే’

-

బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బంగాల్ అసెంబ్లీలోకి ఓ నకిలీ ఎమ్మెల్యే ప్రవేశించిన ఘటన చోటుచేసుకుంది. విధాన సభ గేటు దాటి ప్రధాన భవనం వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది అనుమానం వచ్చి ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతణ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అసెంంబ్లీ భద్రతపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బంగాల్​లో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఆ ‘ఫేక్ ఎమ్మెల్యే’ అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్​ దాటి ప్రవేశించాడు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్​రాయ్​ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగగా.. హరీష్ ఛటర్జీ స్ట్రీట్ నుంచి వచ్చానని తెలిపాడు. అతడి మాటల్లో పొంతన లేకపోవటం వల్ల చాలా సేపు విచారించి పోలీసులకు అప్పగించారు. అతడు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు? అరూప్​ రాయ్ పేరును ఎందుకు ప్రస్తావించాడు? హరీశ్ ఛటర్జీ వీధి గురించి ఎందుకు మాట్లాడాడు? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version