విద్యార్థిని పాము కరిచినా టీచర్లు కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లని ఘటన కేరళలో జరిగింది. పాఠశాలల్లో నాణ్యత లోపిస్తుందని, విషపూరిత ప్రాణులు తిరుగుతున్నాయని ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే ప్రజల్లో మార్పు రావడం లేదు. నష్టం జరిగినా సరే కొందరి ప్రవర్తన ఆందోళనకరంగా ఉంటుంది. వివరాల్లోకి వెళితే… శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు… కేరళ రాష్ట్రంలోని సుల్తాన్ బాథేరిలో ఒక స్కూల్ లో షెరీన్ అనే చిన్నారిని పాము కరిచింది… సకాలంలో అక్కడి టీచర్లు స్పందించకపోవడంతో… చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
దీనితో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయయ్యాయి… విద్యార్థులు విద్యార్థులు, విద్యార్థుల తల్లి తండ్రులు ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం… పాఠశాల హెడ్ మాస్టర్ ని సస్పెండ్ చేసింది. ఇక ఈ ఘటనలో విచారణ మొదలుపెట్టిన తర్వాత ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. కరిచిన పాముని చంపి… కాంక్రీట్ లో దాచి పెట్టారు టీచర్లు… అక్కడ ఉన్న విద్యార్థులు టీచర్ల తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. ఆ బాలికను పాము కరిచింది అని చెప్పినా సరే…
పాప తండ్రి వచ్చే వరకు కనీసం ఆస్పత్రికి తీసుకువెళ్లలేదట. తాము మూడు ఆస్పత్రులకు తీసుకువెళ్లామని అయినా ఫలితం లేకుండా పోయిందని టీచర్లు వాదిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసనలు కూడా రావడంతో కేరళ మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. ఈ ఘటనపై వాయనాడ్ ఎంపీ… రాహుల్ గాంధీ స్పందించారు. మౌలిక సదుపాయాలు క్షీణించాయని, ఆ పాప తల్లి తండ్రులకు పరిహారం అందించాలని కేరళ ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. ఇప్పుడు ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్నారి ఫోటో తో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు విద్యార్థులు…!