ఐఐటీ మద్రాస్‌లో విద్యార్థి ఆత్మహత్య కలకలం!

-

ప్రతిష్ఠాత్మక ఐఐటీ విద్యాసంస్థల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయి. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఇవాళ ఐఐటీ మద్రాస్ లో ఇంజినీరింగ్‌ పీజీ చదువుతున్న 22 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎం.ఎస్‌ చేస్తున్న ఆ విద్యార్థి ఐఐటీ మద్రాస్‌ క్యాంపస్‌లోని హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. మరో విద్యార్థి గుర్తించి హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని వివరించారు. గది తలుపులు తీయగా.. విద్యార్థి సీలింగ్‌కు ఉరివేసుకొని వేలాడుతూ విగత జీవిగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.

ఈ ఘటనపై సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. విద్యార్థి తీసుకున్న ఈ తీవ్రమైన నిర్ణయానికి కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఇంకోవైపు, ఇదే ఇన్‌స్టిట్యూట్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ విద్యార్థి మాత్రలు తీసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version