వైరల్ వీడియో; స్టూడెంట్స్ అంటే ఇలా ఉండాలి…!

-

టీచర్ కు ఊహించని బహుమతి ఇచ్చి విద్యార్ధులు ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. రెండు వారాల క్రితం, ఉపాధ్యాయుడు ట్రే పేన్ యొక్క బాస్కెట్‌బాల్ బూట్లు లోగాన్ మిడిల్ స్కూల్‌లోని తన తరగతి గదిలోనే పోయాయి. దీనితో అతను నిరాశగా ఉన్నాడు. దీనిని గమించిన విద్యార్ధులు అతని కోసం ఒక ప్లాన్ చేసారు.

విద్యార్ధులు అందరూ కలిసి ఆ టీచర్ కి తమ డబ్బుతో బూట్లు కొని గిఫ్ట్ గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. దీనితో అతను భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమ్మా మిచెల్ అనే విద్యార్థి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి, “నా అభిమాన టీచర్ మిస్టర్ పేన్ తన బూట్లు దొంగిలించబడ్డాయి. కాబట్టి నేను మరియు కొంతమంది క్లాస్‌మేట్స్ మా డబ్బును పోగు చేసి అతనికి సరికొత్త జత కొన్నాము” అని పోస్ట్ చేసాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెల్లేవ్ పబ్లిక్ స్కూల్స్ యొక్క ఫేస్బుక్ పేజీ మొత్తం సంఘటనను తమ సుదీర్ఘ పోస్ట్ లో వివరించింది. దీని విలువ ఒక జత బూట్ల కన్నా ఎక్కువ. ఇది చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. కష్టాల్లో ఉన్న వాళ్ళను లేదా బాధలో ఉన్న వాళ్లకు ఇది మంచి ఉత్తేజాన్ని ఇస్తుంది అంటూ పోస్ట్ చేసారు. ఇది ఇప్పటి 4.5 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version