మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

-

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా అయిందంట.. వీళ్లకు ఇలా అయిందంట అనుకుంటూ.. పొద్దుపోయే వరకూ మాట్లాడేసుకుంటారు. అవును అసలు మరణించే ముందు ఎలా ఉంటుంది. మనకు తెలుస్తాందా.. ఇవి చెప్పడానికి.. ఎవరూ ఉండరు కదా.. ఇది ఇంట్రస్టింగ్ కమ్ సెన్సిటివ్ ఇష్యూ.. అయితే.. యాక్సిడెంట్ అయ్యే ముందు కూడా.. కొంత పరిస్థితి తేడాగా ఉంటుందట..అంటే..అందరిలో అని కాదు.. చాలావరకూ..ఘోర ప్రమాదం నుంచి బయటపడిన వారిని అసలు ఎలా అయింది అని అడిగితే.. తప్పు అవతల వారి మీద చెప్తూనే..కరెక్టుగా ప్రమాదం అయ్యేముందు ఏం జరిగిందో వాళ్లకు గుర్తులేదంటారు. ఓ సారి మీ ఆత్మీయుల్లో ఎవరైనా ప్రమాదానికి గురై ఉంటే అడిగిచూడండి. అయితే ఇప్పుడు మనం డెత్ ప్రాసెస్ గురించి చూద్దామా..!
డాక్టర్ కాథరిన్ మానిక్స్ “విత్ ది ఎండ్ ఇన్ మైండ్” రచయిత డెత్ ప్రాసెస్ గురించి ఏం చెప్పారంటే.. మరణానికి భయపడాల్సిన పనిలేదు. చనిపోవడం అనేది.. ఆశించినంత చెడ్డది కాదు. పుట్టడం లాగానే చనిపోవడం కూడా ఒక ప్రక్రియ. చాలా సేపు నిద్రపోయే రకం. అలసట తగ్గిన తర్వాత మనం 6-7 గంటల నిద్ర ఎలా తీసుకుంటామో అలాగే శరీరం బాగా అలసిపోయిన తర్వాత గాఢనిద్రలోకి వెళ్తుందని ఆమె తెలిపారు. నిజానికి చనిపోవడం వల్ల వారి కుటుంభీకులు బాధపడతారు కానీ.. చనిపోయిన వ్యక్తికి అక్కడితే అన్నీ ఆగిపోతాయి. బాధలు, కష్టాలు, సుఖాలు, బంధాలు ఏమీ ఉండవు. గాఢ నిద్రలోకి వెళ్తారు.
థామస్ ఫ్లీస్‌మాన్ అనే వైద్యుడు మరణం గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ఇతడు చావు అంచులదాకా వెళ్లివచ్చిన వారిపై ఓ అధ్యయనం చేశాడట… దాని ప్రకారం మరణం 5 దశలుగా ఉంటుంది. దాదాపు 35 ఏళ్లుగా డాక్టర్‌గా పనిచేసిన ఆయన తన కళ్ల ముందే 2000 మందికి పైగా చనిపోవడం చూశారు.
మొదటి దశ – డాక్టర్ థామస్ చెప్పే దానిప్రకారం.. మరణం మొదటి దశలో వ్యక్తి ఏమీ వినడు. అతను శాంతి అనుభూతి చెందుతాడు. అతడికి భయం, టెన్షన్, కష్టాలు అన్నీ మొదలవుతాయి.
రెండో దశ – మరణం రెండో దశలో ఒక వ్యక్తి తన శరీరంలో కాంతి ప్రసరించడం అనుభవిస్తాడు. గాలిలో ఎగురుతున్నట్లు అనిపిస్తుంది.
మూడవ దశ – మూడో దశలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది. డాక్టర్ థామస్ మాట్లాడిన వారిలో 98 శాతం మంది ప్రజలు రిలాక్స్‌గా ఉన్నారని పేర్కొన్నారు.. మిగిలిన 2 శాతం మంది భయానక జీవులను చూశామని, గగుర్పాటు కలిగించే శబ్దాలు వింటున్నామని, దుర్వాసన వస్తోందని చెప్పారుట.
నాల్గవ దశ – మరణం ఈ దశలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఒక కాంతిని చూస్తాడు. అతను చాలా ప్రకాశవంతమైన, ఆకర్షణీయమైన కాంతిని చూస్తాడు. అది క్రమంగా చీకటిగా మారుతుంది. దీన్నే చాలామంది వారి ఇష్టదైవం వచ్చినట్లుగా చెప్తారు.
ఐదవ దశ – ఈ దశలో వ్యక్తి చనిపోతాడు. అతని శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయింది.
ఈ కథనం కేవలం సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అధ్యయనాలు చెప్పిన దాని ప్రకారం రాయటమైనది. ఎవరి మనోభావాలను ఆటంకం కలిగించే ఉద్దేశం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version