కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర పట్టణాలు, అద్భుత కట్టడాలకు మన దేశం నెలవు..అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిత్రం..ఇదేదో ఫారెన్ టూరిస్ట్ స్పాట్ అనుకుంటే మీరు పొరపడినట్టే..ఇది మన దేశంలోనే ఉంది..ఆకాశం పూర్తిగా నీలిరంగు ఆవహించిన సమయంలో ఓ ప్రకృతి ప్రేమికుడు తీసిన చిత్రం ఇది.
ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది.. నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్ హీమ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ అందమైన ఫోటోని షేర్ చేశారు. సోల్ హీమ్ అక్కడి ప్రకృతి అందానికి మంత్రముగ్దులైనట్లు చెప్పారు. ఈ సిమ్లా చిత్రాన్ని ట్వీట్ చేస్తూ, ‘ఇది యూరప్ కాదు, క్లీన్ అండ్ గ్రీన్ సిమ్లా’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. అంతేకాదు..ఇంత అందమైన సిటీ ఫోటోను షేర్ చేసిన అతనికి నెటిజన్లు థ్యాంక్స్ చెబుతున్నారు.
అతను 2005 నుండి 2012 వరకు నార్వే ప్రభుత్వంలో అంతర్జాతీయ అభివృద్ధి మంత్రిగా, పర్యావరణ మంత్రిగా పనిచేశారు. 2016 నుండి 2018 వరకు ఐక్యరాజ్యసమితి అండర్-సెక్రటరీ-జనరల్, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే అతను కర్ణాటకలోని ఉడిపిలోని బీచ్‌సైడ్ రోడ్ అందమైన చిత్రాన్ని కూడా పంచుకున్నాడు, దీన్ని ‘ప్రపంచంలోని అత్యంత అందమైన సైక్లింగ్ మార్గం అంటూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు..మీరు ఆ ఫోటోను చూడండి ఎంత అందంగా ఉందో.. ఒక లైకో, కామెంటో వేసుకోండి..
Incredible India 🇮🇳
This is not Europe but clean and green Shimla ❤️@thehomestays pic.twitter.com/Bmacihw6Mr
— Erik Solheim (@ErikSolheim) May 22, 2022