కొందరు ఇన్ స్టా రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల కొందరు రీల్స్ కోసం ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం దొంగిలించి అందులో రీల్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజాగా ఓ యువకుడు ఫేమస్ అవ్వడం కోసం నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు మీద చైర్ వేసుకుని టీ తాగుతూ స్టంట్స్ చేశాడు.అది కాస్త వైరల్ అవ్వడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని రాజధాని బెంగళూరు మాగడిలో వెలుగుచూసింది. ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు కేసు నమోదు చేసి యువకుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
రీల్స్ మోజులో యువత పిచ్చి చేష్టలు
బెంగళూరు మాగడిలో రోడ్డు మధ్యలో కుర్చీ వేసి టీ తాగుతూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం రీల్స్ చేసిన యువకుడు. ఈ వీడియో వైరల్ కావడంతో యువకుడిని అరెస్టు చేసిన బెంగుళూరు పోలీసులు. pic.twitter.com/Zdh65wfOYA
— ChotaNews App (@ChotaNewsApp) April 18, 2025