సమ్మర్ వచ్చిందంటే శీతల పానీయాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. చిన్నా పెద్దలు కూల్ డ్రింక్స్ తాగేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ, వాటిని తయారు చేసే కంపెనీలు మాత్రం జనాల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తమ వ్యాపారం పెంచుకుంటున్నారు.
ఇప్పటికే పలుమార్లు బొద్దింకలు, పురుగులు, నల్లులు, బల్లులు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పట్నం హైవే హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి ప్రత్యక్షం అయ్యింది. ఇదేంటని హోటల్ యజమానిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిసింది. వెంటనే సదరు హోటల్ మీద ఆహార భద్రత అధికారులు దాడులు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంగారెడ్డిలో కూల్ డ్రింక్‌లో బల్లి
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని పట్నం హైవే హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించింది. హోటల్ యజమానిని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధారం ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని… pic.twitter.com/mfkDHYUlKp
— ChotaNews App (@ChotaNewsApp) April 18, 2025