కృష్ణా: జిల్లా సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్ కైకలూరులో సినీ ఫక్కీల్లో ఆశ్చర్యపర్చారు. మారువేషంలో ఎరువుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతు వైషధారణలో ఎరువులు కొనేందుకు షాపులకు వెళ్లారు. ఎరువుల ధరలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల సమయానుసారంగా షాపులు తీయలేదు. మరికొన్ని చోట్ల ఎరువులు అధిక ధరలకు అమ్ముతుండటాన్ని గుర్తించారు. రసీదులు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నట్లు నిర్ధారించారు.
మారువేషంలో సబ్ కలెక్టర్.. రెండు షాపులకు వెళ్లి…!
-