తెలంగాణ వైద్య విభాగంలో ఉద్యోగాలు!

-

తెలంగాణ వైద్య విభాగంలో ఉద్యోగాలు ( Jobs ) భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

 

కేవలం తెలంగాణ మాత్రమే కాదు, ఇటీవల దేశ వ్యాప్తంగా మెడికల్‌ విభాగంలో ఉద్యోగాల భర్తీని చేపడుతున్నారు. అయితే తాజాగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నియామకంలో భాగంగా.. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఇక వయో పరిమితి విషయానికి వస్తే… అభ్యర్థుల వయస్సు 34 ఏళ్లకు మించకుండా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల జరగనుంది. అప్లికేషన్‌ ఫామ్‌ లను డీఎంహెచ్‌ఓ సంగారెడ్డి కార్యాలయంలో ఈ నెల 10 వరకు అందించాలని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version