అప్పులే గుణపాఠం చెప్పాయట..షరబత్ వ్యాపారి సక్సెస్ స్టోరీ..

-

జీవితంలో పడిన కష్టాలు సక్సెస్ ను అందుకోవడానికి నాంది అని చాలా మంది నిరూపించారు..వాళ్ళు అనుకున్న స్థానాన్ని అధిరోహించడంతో పాటు అందరికి ఆదర్శం గా నిలుస్తున్నారు.అలాంటి వారిలో ఒకరు లలిత..ఆమె సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

పుణెకు చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి వ్యాపారవేత్త కావాలనే కల. అత్తింటిలో పరిస్థితేమో ఇందుకు విరుద్ధం. ఉద్యోగం చేసి నెల పూర్తయ్యేసరికి జీతం తీసుకుంటే చాలనేది అత్తామామల అభిప్రాయం. తనేమో సొంతంగా వ్యాపారమే చేస్తానని పట్టుబట్టింది. రెండేళ్ల తర్వాత భర్త ప్రోత్సాహంతో పుట్టగొడుగుల పెంపకంలోకి అడుగుపెట్టింది. లాభాలమాట అటుంచి, కనీసం పెట్టుబడి కూడా చేతికి రాలేదు. ఇక తనకు తెలిసిందేదైనా చేయాలనుకొని టొమాటో కెచప్‌ టూటీ-ఫ్రూటీ తయారీ మొదలుపెట్టింది. దీనికోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టింది. తిరిగి నష్టమొచ్చింది. అప్పులు తీర్చడానికి ఉంటున్న ఇంటినే అమ్మాల్సి వచ్చింది. ఎలాగో అప్పులన్నీ తీర్చి, అద్దె ఇంటికి చేరుకుందామె కుటుంబం.

వ్యాపారం లో నష్టం వస్తుంది ఏదైనా ఉద్యోగం చేసుకోమని ఇంట్లో వాళ్ళ ఒత్తిడి..ఇవన్నీ కూడా ఆమెను మానసికంగా మరింత ఇబ్బంది పెట్టాయి.ఈసారి ఏదైనా శీతలపానీయం తయారీ ప్రారంభించాలని ఆలోచించా. రకరకాల ప్రయోగాల తర్వాత 1995లో ‘కోకమ్‌ షర్బత్‌ మొదలుపెట్టాం. అదే ఏడాది నేను రెండోసారి గర్భందాల్చా. నేను ప్రసవించేసరికి ఈ వ్యాపారం కూడా అటకెక్కింది. ఈ పానీయానికి చాలా ఆర్డర్లు వచ్చేవి. దీంతోపాటు టొమాటో కెచప్‌ తయారీ కూడా మొదలుపెట్టాం. అంతా బాగానే ఉందనుకున్నాం.

వ్యాపారానికి కొత్తకావడంతో వినియోగదారుల నుంచి నగదు వసూలు చేయలేకపోయాం. ఈసారి నష్టం మాకు కొత్త పాఠాలను నేర్పింది. అయితే కోకమ్‌ పానీయం వల్ల చాలా ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. అసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలున్నవారు దీన్ని తీసుకుంటే వెంటనే ఉపశమనాన్ని పొందొచ్చు. ఈ ఉత్పత్తిని వినియోగదారుడికి చేర్చడమే కాదు, నగదు వసూళ్ల విషయంలో ఎక్కడ తడబడుతున్నామో గుర్తించడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.

మొదటి ఏడాది నష్టం వచ్చినా, రెండో ఏడాది తిరిగి తయారీ ప్రారంభించింది లలిత. మరోసారి ప్రయత్నించి చూద్దాం అనుకుంటూ, తయారుచేసిన ఈ ఉత్పత్తికి ఈసారి కూడా సేల్స్‌ వచ్చాయి. గత పాఠాలతో వినియోగదారుల నుంచి నగదు తీసుకున్న తర్వాతే ఉత్పత్తులను అందించేవారు. మొదటిసారి రూ.20వేలు ఆదాయం వచ్చింది. మూడో ఏడాదిలో లాభాలు మొదలయ్యాయి. అలా ఈ ఏడేళ్లలో రోజుకి 12 టన్నులకు పైగా కోకమ్‌ పానీయం విక్రయం అవుతుండగా, వార్షికాదాయం రూ.2.5 కోట్లకు చేరింది. ఈ శీతలపానీయ తయారీ కేవలం ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మే వరకు మాత్రమే ఉంటుంది. ఈ నాలుగునెలలు తయారైన ఉత్పత్తి వెంటనే విక్రయమవుతుంది..ఆమె కింద 40 మందికి పై ఎంప్లాయీస్ కూడా ఉన్నట్లు చెప్పింది..ఇదే క్వీన్‌ ఆఫ్‌ కోకమ్‌ 50 ఏళ్ల లలిత బిజినెస్ సక్సెస్ స్టోరీ..

Read more RELATED
Recommended to you

Exit mobile version