రాబోయే మూడు సంవత్సరాలలో తెలంగాణ విజయ డెయిరీ టర్నోవర్ ను రూ, 1500 కోట్ల కు పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను రాష్ట్ర పశుసంవర్ధక. మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించాడు. గురువారం విజయ డెయిరీ ఉత్పత్తుల పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. విజయ డెయిరీ ఉత్పత్తు లను మార్కెట్ లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన అన్నారు.
విజయ డెయిరీ ఉత్పత్తుల టర్నోవర్ ను పెంచే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించాడు. ప్రస్తుతం విజయ డెయిరీ టర్నోవర్ రూ. 800 కోట్లు ఉందని అన్నారు. దానిని మూడు సంవత్సరాలలో రూ. 1500 కోట్ల కు పెంచాలని అన్నారు. అలాగే నాణ్యమైన పాలను పాల ఉత్పత్తులను వినియోగ దారులకు అందించాలని సూచించాడు. బిగ్ బాస్కెట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, సూపర్ డెయిరీ వంటి ఈ కామర్స్ లలో విజయ ఉత్పత్తులను అమ్మాకాలను పెంచాలని అన్నారు. అలాగే ప్రయివేటు డెయిరీ లకు ధీటు గా విజయ డెయిరీ ని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించాడు.