వందల కోట్లు పోయాయి.. ఒంటరయ్యాను – టాలీవుడ్ నటి సుధ

-

బాలనటి గా టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది సీనియర్‌ నటి సుధ. తల్లిగా, వదినగా ఇలా చాలా పాత్రలు చేస్తూ… తన కెరీర్‌ లో మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌ గానూ అందరినీ అలరించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్థికంగా బాగా స్థిరపడిన కుటుంబంలో జన్మించిన తాను, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించానన్నారు. ఢిల్లీలో హోటల్ ప్రారంభించడం వల్ల ఆ డబ్బంతా పోగొట్టుకున్నానని ఆమె చెప్పారు. తన భర్త కూడా దూరంగా విదేశాల్లో ఉంటున్నారని, ఒక విదేశీ అమ్మాయిని పెళ్లాడడంతో తన కొడుకుతో కూడా విభేదాలు వచ్చాయని ఆమె వాపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version