యాదాద్రిలో భారీ స్వాగతం తోరణం.. వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఆవిష్కృతం

-

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ ఆలయం యాదాద్రి పంచనారసింహుల సన్నిధి వైభవానికి అనుగుణంగా భారీ స్వాగత తోరణం ఏర్పాటు చేశారు. వచ్చే ఫిబ్రవరిలో వార్షిక బ్రహ్మోత్సవాల్లోపు ఇది ఆవిష్కృతం కానుంది. కొండపైకి వెళ్లే కనుమదారులను కలుపుతూ వాటి మధ్య 40 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణానికి రూపకల్పన చేశారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆధ్మాత్మికతకు అద్దంపట్టేలా వైటీడీఏ ప్రత్యేకంగా దృష్టిసారించి సిమెంట్‌తో భారీ స్వాగత తోరణాన్ని నిర్మించింది.

వైష్ణవత్వం ప్రస్ఫుటించేలా కొండపైన పంచనారసింహుల ప్రాంగణానికి చేరే దిశలో… కొండ దిగేటప్పుడు తోరణంపైన వెనకా, ముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రూపం, ఇరువైపుల గరుడాళ్వరుడు, అంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటుచేశారు. మూడు స్తంభాలతో రూపుదిద్దుకున్న ఆ తోరణానికి ఇరువైపులాద్వారా పాలకులు, మధ్యలో మహావిష్ణుమూర్తి రూపం కిందిభాగంలో యక్షులు దర్శనమిస్తారు. స్వాగత తోరణం కుడివైపున రక్షణ గోడపైన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో దివ్య విమాన రథోత్సవం సాదృశ్యమయ్యేలా ఐరావతం, తీర్ధజనుల దృశ్యాలను తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version