ఇంద్ర‌గంటితో సుధీర్‌బాబు మూడ‌వ‌సారి!

-

ఇటీవ‌ల నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `వి`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు సుధీర్‌బాబు. ఈ మూవీలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సిక్స్ ప్యాక్ బాడీని చూపించి ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించినా క‌థ‌, క‌థ‌నాల్లో ప‌స లేక‌పోవ‌డంతో అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ మూవీ ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఈ చిత్రాన్ని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించారు.

ఆయ‌న డైరెక్ష‌న్‌లో సుధీర్‌బాబు మ‌రో చిత్రాన్ని చేయ‌బోతున్నారు. ఇది వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ముచ్చ‌ట‌గా మూడ‌వ సినిమా. సోలోగా ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`లో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో చిత్రాన్ని చేయ‌బోతున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించారు. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై బి. మ‌హేంద్ర‌బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి నిర్మించ‌బోతున్నారు.

`ఉప్పెన‌` ఫేమ్ క్రితిశెట్టి హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఇదొక రొమాంటిక్ డ్రామా. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ఫొటోగ్ర‌ఫీ పీజీ విందా, వివేక్ సాగ‌ర్ సంగీతం, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న `వి` ఫ్లాప్ కావ‌డంతో తాజా చిత్రాన్నిసూప‌ర్ హిట్‌గా మ‌ల‌చాల‌ని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ప‌క్కా ప్లాన్‌తో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. సుధీర్‌బాబు ప్ర‌స్తుతం `శ్రీ‌దేవి సోడా సెంట‌ర్‌` చిత్రంలో న‌టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version