జలుబు తో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి…!

-

చాలా మందికి విపరీతంగా జలుబు వస్తూ ఉంటుంది. ఎంత త్వరగా బయట పడాలి అన్న కుదరదు. అటువంటి వాళ్ళు ఈ హెర్బల్ టీలని తీసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం..!

అల్లం టీ:

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది జలుబును త్వరగా తగ్గిస్తుంది. అలాగే తుమ్ములు, దగ్గు కూడా త్వరగా తొలగిపోతాయి.

అల్లం టీ ని ఎలా తయారు చేసుకోవాలి..?

కొద్దిగా అల్లం తీసుకుని వాటిని ముక్కలు కింద తరిగి నీళ్లలో వేయండి. దానిని మరిగించి, బాగా మరిగాక వడగట్టి ఒక కప్పు లో వేసి కొద్దిగా తేనె కానీ పంచదార కానీ యాడ్ చేసుకుని వేడిగా తీసుకుంటే సరి పోతుంది. ఇలా చేయడం వల్ల త్వరగా మీకు ఉపశమనం లభిస్తుంది.

చమోమిలే టీ :

చమోమిలే కూడా హెర్బల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. ఇది కూడా వేగంగా ఉపశమనాన్ని ఇస్తుంది. పైగా జలుబు, తుమ్ములు నుండి కూడా ఈజీగా బయట పడచ్చు.

దీనిని ఎలా ఉపయోగించాలి అంటే..?

ముందు ఒక కప్పు నీళ్లను మరిగించి దానిలో ఒక టీ స్పూన్ చమోమిలే పొడి కానీ టీ బ్యాగ్ ని కానీ వేసుకోండి. ఒక నిమిషం ఉంచిన తర్వాత దానిలో కొద్దిగా తేనే వేసి వేడిగా దీన్ని తీసుకోండి. దీని వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. అలానే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కూడా మీకు లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version