బీపీ మిషిన్‌తో షుగర్ టెస్ట్.. పిచ్చ కామెడీ వీడియో..!!

-

బాలీవుడ్ ఇండస్ట్రీ సీరియల్స్ కు ఎంతో ఫేమస్. ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. మీ అందరికీ ‘సాథ్ నిభానా సాథియా’ సీరియల్ గురించి తెలిసే ఉంటుంది. ఈ సీరియల్‌లోని ఒక సీన్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. ఈ షోలో మెయిన్ క్యారెక్టర్ గోపి బహు.. గోపి బహుకు ఆరోగ్యం బాగుండదు. దీంతో ఆమె మంచంపై పడుకొని ఉంటుంది. ఆమె పక్కన గోపి అత్తగారు కోకిలాబెన్ ఉంటారు. అయితే గోపికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి గోపి పరివార్‌కు చెందిన ఫ్యామిలీ డాక్టర్ వస్తారు. గోపిని బీపీ మిషిన్‌తో చెక్ చేసి ఘగర్ లెవల్ తగ్గాయని చెబుతుంది. ఆ ఒక్కమాటతో నెటిజన్లు ఈ వీడియోను చూసి పడి పడి నవ్వుకుంటున్నారు.

సాత్ నిభానా సాథియా సీరియల్

ఈ వీడియోను డాక్టర్ గ్రిల్ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. బీపీ మిషిన్‌తో షుగర్ లెవల్స్ ఎలా చూస్తారని పలువురు నెటిజన్లు ఫన్నీగా ఎమోజీల రూపంలో కామెంట్లు పెడుతున్నారు. ఇంత పెద్ద టీవీ షోలో ఇంత పెద్ద స్క్రిప్ట్ మిస్టేక్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మినిమం కామన్‌సెన్స్ లేకుండా స్క్రిప్ట్ ఎలా రాశారో అర్థం కావట్లేదని కొందరు మండిపడుతున్నారు. అలాగే బీపీ మిషిన్‌తో షుగర్ టెస్ట్ ఎలా చేస్తారని పలువురు నవ్వుకుంటున్నారు. కాగా, ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 206.3కే వీవ్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version