సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది..!

-

కలర్ ఫోటో సినిమాతో తన సత్తాని చాటాడు సుహాస్. ఇప్పుడు ఒక సినిమాతో మళ్ళీ ప్రేక్షకులు ముందుకి హీరోగా రాబోతున్నాడు సుహాస్. హీరోగా వచ్చిన సినిమాలు చాలా బాగున్నాయి. అలానే ఈ సినిమా కూడా బావుంటుంది అని అంతా అనుకుంటున్నారు. ప్రతి సినిమాని ఫీల్ గుడ్ మూవీ లా చేస్తూ ఎమోషనల్ టచ్ చేస్తున్నాడు సుహాస్. హిట్ టు సినిమాలో విలన్ గా మెప్పించాడు సుహాస్ చివరగా రైటర్ పద్మభూషణ్ సినిమాతో అందరిని అల్లరించాడు. ఇప్పుడు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు అనే సినిమాతో ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

దర్శకుడు దుష్యంత కటినేని ఈ సినిమాని తెస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు సినిమా ట్రైలర్ చూసి పక్క ఎంటర్టైన్మెంట్ సినిమా అని అంతా భావిస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకోవడం కచ్చితం. హీరో హీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, సిస్టర్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనబడుతున్నాడు. మొత్తానికి సినిమా ట్రైలర్ మాత్రం అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news