చంద్రబాబు కి ఊహించని దెబ్బ కొట్టిన సుజనా ?? ఇది అసలు మరచిపోలేని ఘట్టం !!

-

చంద్రబాబు కి అత్యంత నమ్మకమైన నాయకులలో ఒకరి గా ఉండే వాళ్ళు సుజనాచౌదరి. 2019 ఎన్నికలలో టిడిపి దారుణంగా ఓటమి చెందడంతో తర్వాత వెంటనే బాబు ఆదేశాల మేరకు సుజనాచౌదరి బిజెపి పార్టీలో చేరడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ కేంద్రమంత్రిగా సుజనా చౌదరి రాణించడం జరిగింది. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ చిత్తుచిత్తుగా ఓటమి చెందడంతో వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లో సుజనా చౌదరి ఏ విషయంలోనూ చంద్రబాబు కి అనుకూలంగా మాట్లాడకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మూడు రాజధానుల విషయం గురించి గానీ శాసన మండలి రద్దు అనే కీలక విషయాల గురించి గానీ చంద్రబాబు కి అత్యంత నమ్మకంగా ఉండే సుజనా చౌదరి తాజాగా నెల రోజుల నుండి మాట్లాడకపోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారు సుజనాచౌదరి పార్టీ ఓటమి చెందడంతో భవిష్యత్తులో బీజేపీకి రాజ్యసభ బలం అవసరమని తెలుసుకుని ఆయన్ను బిజెపిలోకి పంపించారు చంద్రబాబు.

 

అయితే ఇటువంటి కీలక సమయాలలో సుజనా చౌదరి మాట్లాడకపోవడం తో చంద్రబాబుకి ఊహించని దెబ్బ కొట్టినట్లయింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పైగా చంద్రబాబు పిఎ శ్రీనివాస్ చౌదరి పై జరిగిన ఐటి సోదాల విషయంలో కూడా సుజనా చౌదరి నుండి చంద్రబాబుకి పెద్దగా సపోర్ట్ రానట్టు టీడీపీ వర్గాల్లో వినబడుతున్న టాక్. ఇలాగే సుజనాచౌదరి నోరు మూసుకొని ఉంటే చంద్రబాబు రాజకీయ కెరియర్లో ఇది ఒక మరిచిపోలేని ఘట్టం అవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version