సుజీత్ మెగా ఛాన్స్ నిలబెట్టుకుంటాడా …ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే ..!

-

మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు. నిజంగా అందరూ ఊహించని విధంగా ఆయనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఫైట్స్ అండ్ డాన్స్ తో ప్రూవ్ చేసి షాకిచ్చారు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే మెగాస్టార్ ని 20 ఏళ్ళ క్రితం చూసినట్టే ఉందన్న ఫీలింగ్ కలిగేలా క్రియోట్ చేశారు. ఇక స్క్రీన్ మీద బాస్ ని చూసిన ఏ ఒక్కరు కుదురుగా ఉండలేకపోయారు. ఫ్యాన్స్ మాట అలా ఉంచితే సినిమా ఇండస్ట్రీలోనే చాలా మంది యంగ్ అండ్ సీనియర్ హీరోలు ఆశ్చర్యపోయారు. అన్నయ్య ఇలా ఎంట్రీ ఇస్తారని అసలు ఊహించలేదంటూ ఆకాశానికి ఎత్తేశారు.

 

ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి కి 15 ఏళ్ళ నుంచి ఉండిపోయిన కలని నెరవేర్చుకోవడానికి సైరా నరసింహా రెడ్డి సినిమా చేయడానికి ఒప్పుకొని మరోసారి ఇండస్ట్రీలో అందరికీ షాకిచ్చారు. ఈ సమయం లో సైరా లాంటి సినిమా చేయగలరా .. యుద్ద విన్యాసాలు, సాహసాలు చేసే స్టామినా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తపరచారు. అలాంటి వాళ్ళందరికి సైరా ఫస్ట్ లుక్ అండ్ టీజర్ తో గట్టిగా సమాధానం చెప్పారు. ఇక సైరా రిలీజయ్యాక మెగాస్టార్ లో ఏమాత్రం పవర్ తగ్గలేదని ఇలాంటి సినిమాలు అలా… చేసుకుంటు వెళ్ళిపోతారని ప్రశంసలు కురిపించారు.

ఇక ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఆచార్య సినిమా చేస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర ఈ సినిమాలో పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి వరసగా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టారు. ఇది నిజంగా చాలామందికి ఆశ్చర్యంగా ఉంది. ఇదే కాదు సుజీత్ లాంటి దర్శకుడి కి అవకాశం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

 

అందుకు కారణం సుజీత్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. వాటిలో ఒక సినిమా శర్వానంద్ తో తీసిన చిన్న సినిమా రన్ రాజా రన్ కాగా మరోటి రెబల్ స్టార్ ప్రభాస్ తో తీసిన సాహో. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నా దర్శకుడిగా సుజీత్ కి చాలా మంచి పేరు దక్కింది. అందుకే ఇప్పుడు సుజీత్ కి అవకాశం ఇచ్చారట. మళయాళం లో సూపర్ హిట్టయిన లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ నటిస్తుండగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారని అంటున్నారు. త్వరలో అధికారకంగా ప్రకటన వెలువడనుంది. మరి సుజీత్ ఈ మెగా ఛాన్స్ నిలబెట్టుకుంటాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version