“లూసిఫర్” .. మళయాళంలో మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా మీద చాలా మంది హీరోలు, నిర్మాతలు మనసు పడ్డారు. కాని అందరితో పోటీ పడి రాం చరణ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. అంతేకాదు కేవలం తన తండ్రి కోసమే “లూసిఫర్” రైట్స్ కొన్నారట చరణ్. ‘సాహో’ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న సుజీత్ నీ ఈ సినిమాని తెరకెక్కించడానికి ఎంచుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా స్క్రిప్ట్ ని చిరంజీవి ఇమేజ్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే పనిలో బిజీ అయిపోయాడు సుజీత్.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. వాస్తవంగా ముందు ఈ సినిమాని త్రివిక్రం, వి వి వినాయక్ లు తెరకెక్కిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే చివరికి ఆ ఛాన్స్ యంగ్ దర్శకుడు సుజీత్ దక్కించుకొని అనుకున్న మార్పులు చేసి ఫైనల్ వర్షన్ మెగాస్టార్ కి, చరణ్ కి వినిపించడానికి సిద్దంగా ఉన్నాడట. అంతేకాదు ఆ మార్పులు పాన్ ఇండియా లెవల్ లో చేసినట్టు తెలుస్తుంది. మెగాస్టార్ ని అదే రేంజ్ లో ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ ఆయ్యోలా చూపించాలని తాపత్రయపడుతున్నాడట.
వెంకీమామ’ డైరెక్టర్ బాబీ చెప్పిన స్క్రిప్ట్‌కు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని తప్పకుండా ఆ స్క్రిప్టుతో సినిమా చేద్దామని బాబీకి కూడా మెగాస్టార్ మాట ఇచ్చారట. ఇదే విషయాన్ని చిరంజీవి చెప్పినప్పటికి అఫీషియల్ గా ఇంకా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. ఇక ప్రస్తుతం చిరంజీవి కోరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా కంప్లీటయ్యాక బాబి తో చేస్తారా లేక లూసీఫర్ రీమేక్ తో సుజీత్ తో కలిసి సెట్స్ మీదకి వస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది. ఇక చిరంజీవి కోసం హరీష్ శంకర్, మెహర్ రమేష్ కూడా లైన్ లో ఉండగా ఇప్పుడు సంపత్ నంది కూడా వచ్చి చేరాడు.