త‌మిళ స్టార్ హీరోతో సుకుమార్ సినిమా!

-

పుష్ప మొద‌టి పార్ట్ సినిమాతో డైరెక్ట‌ర్ సుకుమార్ హిట్ మూడ్ లో ఉన్నాడు. పుష్ప సినిమా తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా చాలా పెద్ద హిట్ అయింది. త‌మిళ్ లో కూడా పుష్ప అశించిన స్థాయిలో కంటే ఎక్కువ హిట్ అందుకుంది. అయితే వ‌చ్చే నెల‌లో పుష్ప రెండో పార్ట్ షూటింగ్ జ‌ర‌గ‌నుంద‌ని సుకుమార్ ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అయితే ఈ సినిమా త‌ర్వాత సుకుమార్ బిజి బిజి గా ఉండ‌నున్నాడు. ఇప్ప‌టికే ప‌లువురు హీరోల‌తో సినిమా చేయ‌డానికి అంగీక‌రించాడు.

వాటి కోసం క‌థ‌ల‌ను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే తాజా గా ఒక వార్త సోష‌ల్ మీడియాల తెగ వైర‌ల్ అవుతుంది. త‌మిళ స్టార్ హీరో ధనుష్ తో లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ఒక సినిమా చేయ‌డానికి సిద్ధం అయ్యార‌ని తెలుస్తుంది. ఒక అద్భుత మైన క‌థ‌ను ధ‌నుష్ కు వినిపించ‌గా.. ధ‌నుష్ ఈ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ త్వ‌ర‌లోనే ఈ సినిమా కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది.

 

అయితే ప్ర‌స్తుతం ధ‌నుష్ కూడా ప‌లు సినిమా ల‌తో బిజీ గా ఉన్నాడు. తెలుగు లోనే వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సార్ అనే చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అలాగేశేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు త‌మిళ్ లో కూడా ధ‌నుష్ కు చాలా సినిమాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version