సుమ షాకింగ్ నిర్ణయం.. యాంకరింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టేనా..?

-

బుల్లితెర షో లు అయినా .. సినిమా ఈవెంట్ లు అయినా ముందుగా గుర్తొచ్చే పేరు యాంకర్ సుమ. ఈమె లేనిదే ఏం ప్రోగ్రామ్ కూడా ముందుకు సాగదు అని చెప్పడంలో సందేహం లేదు. అంతలా బుల్లితెర మహారాణిలా గుర్తింపు తెచ్చుకున్న సుమ వరుసగా షోలు చేస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంది. తన కామెడీ టైమింగ్ తో చాకచక్యమైన యాంకరింగ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సుమ అతి తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బుల్లితెర నెంబర్ వన్ యాంకర్ కూడా ఈమె కావడం గమనార్హం. ఇకపోతే యాంకరింగ్ లో సరికొత్త పద్ధతులను అవలంబించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈటీవీలో స్టార్ మహిళ ప్రోగ్రాం ని ఏకంగా 4000 ఎపిసోడ్ల పాటు చేసి అరుదైన ఘనత సాధించిన సుమ ఇప్పుడు అన్ని చానల్స్ లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలోనే ఆమె యాంకరింగ్ కి బ్రేక్ ఇవ్వబోతుందని సమాచారం . ఇకపోతే రాబోతున్న న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో “వేర్ ఇస్ ద పార్టీ” అనే ప్రోగ్రాం కి హోస్ట్ గా చేస్తున్నారు సుమ. ఇందులో సుమాను సన్మానించారు. ఈ సందర్భంగా తన యాంకరింగ్ కెరియర్ ను గుర్తుచేసుకుని తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

కొంతకాలం పాటు యాంకరింగ్ కి విరామం ఇవ్వాలనుకుంటున్నానని కూడా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో యాంకరింగ్ కి ఈమె బ్రేక్ ఇవ్వనుందా ఏంటి అంటూ కూడా అందరూ షాక్ అవుతున్నారు.. లేదా ఇది స్కిట్లో భాగంగా సుమా ఫ్రాంక్ చేస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తం అవుతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. మరి అసలు విషయం తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ పూర్తయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version