వెండితెరపై లవర్ బాయ్స్ చాలామంది ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద హీరోయిన్లతో ఓ రేంజ్లో రొమాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. రీల్ లైఫ్‌లో అందరూ డేటింగ్లు, రొమాన్స్‌లు చేయడం కామన్. అయితే రియల్ లైఫ్‌లోనూ చాలా మంది అమ్మాయిలతో డేటింగులు, ప్రేమలు నడుపుతుంటారు కొందరు హీరోలు. సందీప్ కిషన్ కూడా ఈ కోవలోకే వస్తాడు. సందీప్ కిషన్‌కు హిట్లు తక్కువైనా అతడిపై వచ్చిన రియల్ లైఫ్ లవ్ స్టోరీలు, డేటింగుల కథనాలకు మాత్రం కొదవలేదు.
ఓ టాలీవుడ్ హీరోయిన్‌తో వరుసగా సినిమాలు చేయడంతో వాళ్లిద్దరి మధ్య డేటింగ్ వ్యవహారం నడిచిందన్న ప్రచారం బాగా జరిగింది. ఇక తాజాగా నినువీడని నీడను నేను సినిమాతో హిట్ కొట్టాడు సందీప్. ఇక ఈ పుకార్ల సంగతేమో గాని సందీప్ తన లవ్ లైఫ్‌పై స్పందించాడు. తాను రియల్ లైఫ్‌లో ఒకరు కాదు… ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు అమ్మాయిలతో డేటింగ్ చేశానని ఒప్పుకున్నాడు.
ఒక్కో ఏజ్‌లో ఒక్కో అమ్మాయితో డేటింగ్ చేశానని… ఇక ఈ ఎఫైర్లు అన్ని తాను హీరోగా మారాక జరిగినవే అని కూడా ఓపెన్ అయిపోయాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు చాలా అందంగా ఉండేవారని….. వారితో లవ్ చాలా బ్రహ్మాండంగా ఉండేదని… దురదృష్టవశాత్తు వారిలో ఏ ఒక్కరితోనూ తన రిలేషన్ షిఫ్ నిలబడలేదని చెప్పాడు. వాళ్ల ముగ్గుర్నుంచి తను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు.
మూడు ఎఫైర్ల గురించి చెప్పిన సందీప్ వాళ్ల పేర్లు మాత్రం చెప్పలేదు. ఇక తాను ఫ్యూచర్లో ప్రేమ పెళ్లి చేసుకుంటానని కూడా కుండబద్దలు కొట్టేశాడు. ఇక తన తాజా సినిమా నినువీడని నీడనునేను హీరోయిన్ అనన్యసింగ్తోనూ ఎఫైర్ ఉన్నట్టు గాసిప్స్ వస్తున్నాయని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపడేశాడు. ప్రస్తుతానికి తాను సింగిల్ గా ఉన్నట్టు చెప్పాడు.