కరోనా వ్యాక్సిన్ విషయంలో సూపర్ గుడ్ న్యూస్… అతిపెద్ద గ్రీన్ సిగ్నల్ దొరికింది..!

-

మందు లేని కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. మనిషి నుండి మనిషికి వ్యాపిస్తున్న ఈ వైరస్ వల్ల వేల సంఖ్యలో ప్రపంచంలో మరణాలు సంభవించాయి. కాగా లక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భూమి మీద ఉన్న అన్ని వైరస్ ల కంటే పది పర్సంటేజ్ ప్రమాదకరమైన వైరస్ ఈ కరోనా అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. మందు, వ్యాక్సిన్ వచ్చేదాకా సోషల్ డిస్టెన్స్ మరియు చేతుల పరిశుభ్రత వల్ల మాత్రమే ఈ వైరస్ నుండి తప్పించు కోగలరని డబ్ల్యు.హెచ్.వో తెలిపింది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ పై ప్రస్తుతం ప్రపంచ మానవాళి అంతా కనిపించని పోరాటం చేస్తుంది. మరోపక్క డాక్టర్లు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వ్యాక్సిన్ విషయంలో సూపర్ గుడ్ న్యూస్ లాంటి వార్త చైనా నుండి వినబడుతోంది. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లో దీనికి విరుగుడు కోసం రెండు వ్యాక్సిన్లను ఆ దేశ శాస్త్రవేత్తలు సిద్ధం చేశారట.

 

ప్రస్తుతం అవి ప్రయోగ దశలోనే ఉన్నాయి. తాజాగా చైనా ప్రభుత్వం మనుషులపై ప్రయోగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో..బీజింగ్‌కు చెందిన సైనోవాక్ బయోటెక్, వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ సంస్థలు ఈ వ్యాక్సీన్లను సిద్ధం చేశాయట. కాగా, చైనా మిలటరీ మెడికల్ రీసెర్చి విభాగం తయారు చేసిన ఓ వ్యాక్సీన్‌ను కూడా మనుషులపై ప్రయోగించడానికి మార్చి నెలలోనే చైనా అంగీకారం తెలిపింది. దీంతో ఈ రెండు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించడానికి చైనా శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. మరి రాబోతున్న ఈ రెండు వ్యాక్సిన్ లలో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version