జియో యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్…!

-

రిలయెన్స్ జియో యూజర్లకు సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. ఇక నుంచి వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ రిలయెన్స్ జియో ద్వారా చేసుకోవచ్చు. దీనికి అదనపు చార్జీలు ఏమీ లేవు. భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం ఉంది. దీని కోసం కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది.

గత కొన్ని రోజులుగా వైఫై ద్వారా వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పరిక్షిస్తున్న రిలయెన్స్ జియో, జనవరి 8న దేశవ్యాప్తంగా ఈ సర్వీస్‌ని ప్రారంభించింది. కస్టమర్లు ఏ వైఫై నెట్వర్క్ అయినా ఉపయోగించుకొని జియో వైఫై కాలింగ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. VoLTE లేదా వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్‌కి సులువుగా మారిపోవచ్చు. జియో వైఫై కాలింగ్ దాదాపు అన్ని ప్రధాన స్మార్ట్‌ఫోన్లల్లో అందుబాటులో ఉంటుంది. ఇండియాలో జనవరి 7 నుంచి 16 మధ్య జియో వైఫై కాలింగ్ అందుబాటులోకి వస్తుంది.

మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సదుపాయం ఉంటే ఈ సర్వీస్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిపై స్పందించిన సంస్థ డైరెక్టర్ ఆకాష్ అంబాని, సగటు జియో వినియోగదారుడు నెలకు 900 నిమిషాల వాయిస్ కాల్స్ చేస్తున్నట్టు గుర్తించాం. కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున వాయిస్ కాలింగ్ అనుభవాన్ని పెంపొందించేందుకు జియో వైఫై కాలింగ్ సర్వీస్‌ని ప్రారంభించామని చెప్పారు. Jio.com/wificalling వెబ్‌సైట్‌ ద్వారా మీ ఫోన్‌కు వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version