చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో డబ్బులు పెడితే అదిరే లాభాలు ఉంటాయి. ఈరోజు పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ లో బెస్ట్ స్కీమ్స్ వివరాలని చూసేద్దాం..ఇందులో డబ్బులు పెడితే ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పైగా ఎక్కువ ఎక్కువ వడ్డీ రేటు ఈ స్కీమ్స్ ద్వారా వస్తుంది. స్కీమ్ కాల వ్యవధి ఒక సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు ఒక సంవత్సరం అకౌంట్‌కు 6.9 శాతం, రెండు, మూడు సంవత్సరాల అకౌంట్లకు 7 శాతం, ఐదేళ్ల అకౌంట్‌కు 7.5 శాతం గా ఉంది.
పోస్టల్ స్కీమ్స్ లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటి ఉండి. రూ. 100 నుంచి నెలవారీ డిపాజిట్లు చేయవచ్చు. 6.5 శాతం చొప్పున వడ్డీ పొందవచ్చు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ లో పెడితే.. వడ్డీ రేటు 7.40 శాతం వస్తుంది. ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌పై సంవత్సరానికి 4 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇదిలా ఉంటే కిసాన్ వికాస్ పత్ర లో అయితే 123 నెలల్లో పెట్టుబడి అంతా కూడా రెట్టింపు అవుతుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 7 శాతంగా ఉంది. ప్రభుత్వ పదవీ విరమణ పథకం ఇది. ఇదిలా ఉంటే రిటైర్‌మెంట్ ఫండ్స్ కోసం PPF మంచి స్కీమ్. సెక్షన్ 80C కింద ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు వస్తుంది. ఈ పథకం వడ్డీ రేటు 7.1 శాతం గా ఉంది.