మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారలాంచనాలతో ముగిసిన కృష్ణ అంత్యక్రియలు

-

మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు మహేష్ బాబు. కృష్ణ పార్థివదేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి సంతాపం ప్రకటించారు పోలీసులు.

అంతకుముందు పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కడసారి తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కన్నీరు పెట్టుకున్నారు. ఇక సెలవు అంటూ వీడ్కోలు పలికారు. సూపర్ స్టార్ కృష్ణకు వారి కుటుంబ ఆచారం ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో నుదిటిన వైష్ణవ నామం పెట్టారు. మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆయన అభిమానులు కన్నీటితో వెనుతిరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version