క్యాసినో కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణకు ఈడి నోటీసులు

-

క్యాసీనో, మనీలాండరింగ్ కేసు తెలుగు రాష్ట్రాలలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తాజాగా మరింత దూకుడు కనపరుస్తుంది. ఈ కేసులో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. తాజాగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి కి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. త్వరలోనే ఈడి అధికారులు వీరిని విచారించే అవకాశం ఉంది.

 

ఇదిలా ఉంటే నేడు ఈడి అధికారుల ముందు హాజరయ్యారు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్. క్యాసీనో, హవాలా కేసులో ఆరోపణలపై వీరిద్దరిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా వీరి ఆర్థిక లావాదేవీలపై ఈడి వీరిని విచారిస్తుంది. ఇక ఈ కేసులో ఇప్పటికే చీకోటి ప్రవీణ్ ను ఈడి అధికారులు పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version