హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించిన సూపర్ స్టార్

-

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఒక్కసారిగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కరలేదు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ మూవీలో విలన్ రోల్ చేసిన ఆయన.. బాహుబలి పార్ట్-1లోనూ నటించారు.

అయితే, సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ కోసం ఆయన తన జట్టు కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం ఉప్పల్‌ స్టేడియంకు మెట్రోలో ప్రయాణించారు. ఈసందర్భంగా పలువురు అభిమానులు, మెట్రో సిబ్బందితో ఫొటోలు దిగారు. ఈ పిక్స్ తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, దాదాపు 11 సీజన్లగా సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ జరుగుతోంది. కర్ణాటక బుల్డోజర్స్‌ టీమ్‌కు కిచ్చా సుదీప్‌ కెప్టెన్‌గా ఉన్నారు.ఫిబ్రవరి 14న ఉప్పల్‌ స్టేడియం వేదికగా కర్ణాటక టీమ్, చెన్నై రైనోస్‌తో తలపడనుంది.14, 15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.15న తెలుగు వారియర్స్‌, చెన్నై రైనోస్‌ జట్లు తలపడనున్నాయి.

https://twitter.com/ChotaNewsApp/status/1889889576141070740

Read more RELATED
Recommended to you

Latest news