తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో మిర్చి, పత్తి ని సాగు చేసిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పంటల కొనుగోళ్లు, రుణ ప్రణాళిక, కల్తీ విత్తనాలు, పురుగు మందులు తో పాటు పలు సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే రెండు నెలల్లో 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
ఇటీవల మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్యం వేదికలు కూడా మహబూబ్ నగరలో పర్యటించాయని అన్నారు. ఆత్మహత్యపై నివేదికలను కూడా తయారు చేశారని తెలిపారు. కాగ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో కోరారు. అలాగే రూ. లక్ష రుణ మాఫీని కూడా వెంటనే అమలు చేయాలని లేఖలో సీఎం కేసీఆర్ ను విజ్ఞప్తి చేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతుల ప్రయివేట్ అప్పుల విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు అండగా ఉండాలని అన్నారు.