ఖైదీలకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్..!

-

ఖైదీల‌కు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంట‌నే విడుద‌ల‌య్యేలా ఫాస్ట‌ర్ విధానం అమ‌లుకు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌ ఇచ్చింది. కోర్టు ఉత్త‌ర్వులు వెలువ‌డిన వెంట‌నే ఖైదీల విడుద‌ల చేసేలా సిజె ఐ ఎన్వీ ర‌మ‌ణ ధ‌ర్మాస‌నం ఆదేశాలు ఇచ్చారు. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కార‌ణాల‌తో ఖైదీల విడుద‌ల‌లో జ‌రుగుతున్న జాప్యంపై సుమోటో గా తీసుకుని సుప్రీం ధ‌ర్మాస‌నం విచారణ జరిపింది. ఖైదీల విడుద‌ల‌లో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్ట‌ర్ విధానం అమ‌లుకు ఆదేశాలు ఇచ్చింది.

supreme-court
supreme-court

కోర్టు ఉత్త‌ర్వులు సంబంధిత జైళ్ల‌కు వెనువెంట‌నే చేరేందుకు ఫాస్ట‌ర్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని సుప్రీం ఆదేశించింది. అన్ని జైళ్ల‌లో ఇంట‌ర్‌నెట్ సౌక‌ర్యాల‌ను త‌క్ష‌ణ‌మే ఏర్పాటు చేయాల‌ని సిఎస్ ల‌ను సుప్రీం ఆదేశించింది. అప్పటివరకూ నోడ‌ల్ ఏజెన్సీ ద్వారా ఫాస్ట‌ర్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని సుప్రీం అన్ని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఫాస్ట‌ర్ విధానం ద్వారా ఇక‌పై మెయిల్‌లో సంబంధిత జైళ్ల కే బెయిల్ ఉత్త‌ర్వులు పంపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news