నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

-

ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉదయం 11 నుండి శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ ప్రొటెం స్పీకర్ వెన్న వరం భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో… అసెంబ్లీ కమిటీ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ, కరోనా నిబంధనల పై చర్చించారు.

కాగా.. ఈ అసెంబ్లీ సమావేశాలలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా దళిత బంధు పథకం అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపు, 50 వేల ఉద్యోగాల నియామకం ఇలాంటి విషయాలపై సభ్యులు చర్చించనున్నాయి.

అలాగే… తొమ్మిది మంది మాజీ శాసన సభ్యులకు సంతాప తీర్మానం పెట్టనుంది తెలంగాణ అసెంబ్లీ. అనంతరం సభ వాయిదా పడనుంది. ఇక సోమవారం నుంచి యథావిధిగా అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ జరిగే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరై… ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news