అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు పుననిర్మాణం కేసుకు సంబంధించిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ కేసుని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్.కె.కౌల్‌లతో ధర్మాసనం విచారించనుంది. అయోధ్య వివాదంపై గతంలో దాఖలైన 4 సివిల్ వ్యాజ్యాలపై అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంటూ 2010 తీర్పు వెలువరించింది.
దీంతో తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఈ 14 విజ్ఞాపనలపై నేడు కీలక ఆదేశాలు జారీ చేయనుంది. అయితే అత్యవసర విచారణ చేపట్టాలని గతంలో కోరినప్పటికీ సుప్రీం తిరస్కరించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.