పోలవరంపై వాస్తవాలతో కూడిన నివేదిక అందించండి.. జలశక్తి శాఖకు సుప్రీం ఆదేశాలు

-

పోలవరం నిర్మాణంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అవసరమైతే ముఖ్యమంత్రులు, సీఎస్ ల స్థాయిలో చర్చలు జరపాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలవరం నిర్మాణంలో పర్యావరణ అనుమతులు పాటించలేదంటూ.. సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తమ రాష్ట్రాల్లో ముంపు సమస్యలు ఉన్నాయని కొందరు వ్యక్తులు, సంస్థలు కలిపి పిటిషన్లు వేశారు. పర్యావరణశాఖ అనుమతులు, ప్రాజెక్టు నిర్మాణానికి పొంతన లేదని ఫిర్యాదు చేశారు. పర్యావరణ అనుమతులపై పునఃసమీక్ష చేయాలని సుప్రీంను కోరారు. అన్ని పిటిషన్లు కలిపి త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించింది. వాస్తవాలతో కూడిన నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలిచ్చింది. కేసు విచారణలో అదనపు పత్రాలు సమర్పించేందుకు రాష్ట్రాలు అనుమతి కోరగా.. అందుకు ధర్మాసనం అంగీకరించింది. కేసు విచారణ డిసెంబరు 7కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version