కరోనా వైరస్ నేపధ్యంలో సుప్రీం కోర్ట్ కి లాక్ డౌన్ ప్రకటించారు. అత్యవసరం అయితే మినహా పిటీషన్లు స్వీకరించేది లేదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఇకపై వారానికి ఒక్క రోజే సుప్రీం కోర్ట్ తెరిచి ఉంచుతామని చీఫ్ జస్టీస్ ప్రకటించారు. రేపు సాయంత్రం లోగా లాయర్ ఛాంబర్స్ అన్ని మూసి వేయాలని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ ఆదేశాలు ఇచ్చారు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారానే ఇక నుంచి కేసులను విచారణ చేస్తారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, హర్యానా, పంజాబ్, ఇలా ఎక్కడ చూసినా సరే లాక్ డౌన్ అమలులోనే ఉంది. అయితే ప్రజలు మాత్రం ఎక్కడా కూడా మాట వినడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా సరే బయటకు వస్తున్నారు. పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే ఎవరూ కూడా వినడం లేదు.
ఒక పక్క ప్రపంచ దేశాలు అన్నీ కూడా కరోనా తీవ్రతతో ఇబ్బంది పడుతున్నా ప్రజలు మాత్రం లెక్క చేయడం లేదు. ఆటోలు, క్యాబ్ లను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని న్యాయస్థానాలు కూడా దాదాపుగా మూసి వేసారు. అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తున్నారు. కాగా కరోనా కేసులు దేశంలో 420 వరకు చేరాయి. 8 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.